Hyderabad:

Hyderabad: హైద‌రాబాద్ ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌.. గోల్కొండ‌-టూంబ్స్ సంద‌ర్శ‌న‌కు త్వ‌ర‌లో రోప్‌వే

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌ర ప‌ర్యాట‌కుల‌కు శుభ‌వార్తేన‌ని చెప్పుకోవ‌చ్చు. న‌గ‌రంలో మొట్ట‌మొద‌టి రోప్‌వే నిర్మాణానికి హెచ్ఎండీఏ ఏర్పాట్లలో ఉన్న‌ది. ఈ మేర‌కు ప్రాజెక్టు అంచ‌నా కోసం హెచ్ఎండీఏ క‌న్సెల్టెన్సీ సంస్థ‌కు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఆ నివేదిక కూడా త్వ‌ర‌లో అంద‌నుండ‌టంతో రోప్ వే ఏర్పాటు పనులు కూడా త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతాయ‌ని భావిస్తున్నారు.

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌ధానంగా చారిత్రక ప్ర‌దేశమైన గోల్కొండ కోట‌-టూంబ్స్‌ను ఈ రోప్ వే ద్వారా ప‌ర్యాట‌కులు సంద‌ర్శించే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్నారు. ఈ రెండింటి న‌డుమ 1.5 కిలోమీట‌ర్ల మేర రోప్‌వే నిర్మాణం చేప‌ట్టాల్సి ఉంటుంది. రోప్‌వే ద్వారా చేరుకోవాలంటే కేవ‌లం 10 నిమిషాలే ప‌డుతుంది. పర్యాట‌కులు తొలుత గోల్కొండ కోట‌ను చూశాక‌, రోప్‌వే ద్వారా టూంబ్స్‌కు చేరుకుంటారు. అక్క‌డ ప్ర‌దేశాల‌ను చూశాక‌, అక్క‌డి నుంచి కోట‌కు సుల‌భంగా చేరుకోవ‌చ్చు.

Hyderabad: ఈ రోప్‌వేను పీపీపీ భాగ‌స్వామ్యంతో హెచ్ఎండీఏ ఏర్పాటు చేయ‌నున్న‌ది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు, సాధ్యాసాధ్యాల‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి నైట్‌ఫ్రాంక్ సంస్థ‌ను కన్స‌ల్టెన్సీగా బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. మూడు నెల‌ల్లో నివేదిక‌ను ఇవ్వాల‌ని హెచ్ఎండీఏ గ‌డువు విధించింది. ఈ మేర‌కు ఆ గ‌డువు కూడా పూర్తికావ‌చ్చింది. ఆ నివేదిక అంద‌గానే ఇత‌ర అంశాల‌నూ ప‌రిశీలించి ప్ర‌భుత్వ అనుమ‌తితో ప‌నుల‌కు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉన్న‌ది. ఇదిలా ఉండ‌గా, గోల్కొండ కోట‌-టూంబ్స్ న‌డుమ ర‌క్ష‌ణ శాఖ స్థలాలు ఉన్నాయి. ఆ మేర‌కు ర‌క్ష‌ణ శాఖ నుంచి కూడా అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ఈ రోప్‌వే నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు ఖ‌ర్చ‌వుతుందని ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *