Hyderabad: రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇక్కడే అప్లై..

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇప్పటి వరకు నూతన రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు మీసేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్త రేషన్ కార్డుల కోసం ఇకపై మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయవచ్చు.ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడానికి మీసేవా సేవలను ఉపయోగించుకోవచ్చు.కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, చిరునామా మార్పు వంటి సవరణలను మరింత సులభంగా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ సేవల వల్ల ప్రజలు రేషన్ కార్డు సంబంధిత పనులు వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసుకునే వీలుంటుంది.

ప్రభుత్వ ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చనుంది. ఇకపై ప్రజలు రేషన్ కార్డు దరఖాస్తు లేదా మార్పుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీసేవా కేంద్రాల ద్వారా సులభంగా ప్రాసెస్ చేయించుకోవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kasthuri: కోర్టు మెట్లెక్కిన‌ న‌టి క‌స్తూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *