Hyderabad: గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిందితుడు బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుండి మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో, ఈ తుపాకులను బీహార్ గ్యాంగ్ నుండి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ప్రిజం పబ్‌లో పోలీసులు తనను పట్టుకునేందుకు ప్రయత్నించగా, ప్రభాకర్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ కాల్పుల్లో సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరామ్‌రెడ్డి గాయపడ్డారు. పోలీసులు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభాకర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు ఉన్నాయని, అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా గుర్తింపు పొందినట్లు పోలీసులు తెలిపారు.