Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హైదర్‌నగర్ ప్రాంతంలో కల్తీ కల్లు తాగిన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం కల్తీ మద్యం సేవించిన 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరూ విరేచనాలు, లోబీపీ వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు.
వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో వారికి కల్తీ కల్లు తాగినందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిర్ధారించారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతన్ని కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించారు. త్వరలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆసుపత్రికి చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.