PJR Flyover: హైదరాబాద్ ఇప్పుడు ముంబయి, బెంగళూరు, చెన్నైతో కాదు.. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. “తెలంగాణ రైజింగ్ 2047” లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఎవరైనా అడ్డుకున్నా అభివృద్ధి ఆగదని స్పష్టంగా చెప్పారు.
గచ్చిబౌలిలో మూడో స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభం
గచ్చిబౌలి జంక్షన్‌లో పీజీఆర్ (PJR) ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించారు. ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్ల పైన మూడవ స్థాయిలో నిర్మించిన ఫ్లైఓవర్. ఇది:
-
పొడవు: 1.2 కి.మీ
-
వెడల్పు: 24 మీటర్లు
-
లేన్‌లు: 6
-
ఖర్చు: రూ.182.72 కోట్లు
-
ఉపయోగం: రోజుకు 2.72 లక్షల వాహనాల ప్రయాణం
ఈ ఫ్లైఓవర్ ద్వారా ORR నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎయిర్‌పోర్ట్ వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణించే వీలవుతుంది. గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య 10 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Mahaa Vamsi: చెప్పేవి శ్రీరంగ నీతులు దురేవి గుడిసెలు అని..
స్మార్ట్ ట్రాఫిక్‌కు స్మార్ట్ వాహనాలు
హైదరాబాద్‌ను సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా, పొల్యూషన్‌ను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ (EV), CNG వాహనాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. వచ్చే రోజుల్లో నగరంలో:
-
3,000 ఎలక్ట్రిక్ బస్సులు
-
EV, CNG ఆటోలకే పర్మిషన్
-
డీజిల్ వాహనాలపై నియంత్రణ
అన్నీ పర్యావరణహిత నగరంగా మారే దిశగా తీసుకుంటున్న చర్యలే.
మూసీ రివర్ ఫ్రంట్‌కు నిధులు ఏందీ?
గుజరాత్‌కు సబర్మతి, ఢిల్లీకి యమునా, యూపీకి గంగా కారిడార్‌లు ఉన్నా.. మన మూసీ రివర్ ఫ్రంట్ కోసం కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని సీఎం ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు.
“భారత్ ఫ్యూచర్ సిటీ” – 30 వేల ఎకరాల్లో కొత్త దృక్పథం
-
హైదరాబాద్ సమీపంలో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ
-
అందులో 15 వేల ఎకరాలు ఓపెన్ స్పేస్ – అడవులుగా అభివృద్ధి
-
హైడ్రా ప్రాజెక్టు ద్వారా చెరువులు, నాలాల రక్షణ
నాగార్జున నిజమైన హీరో
నగరంలోని ఒక చెరువు అభివృద్ధికి హీరో నాగార్జున తన ఎన్ కన్వెన్షన్ భవనాన్ని తొలగించాక… రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చి సహకరించడమంటే నిజమైన చొరవ, అని సీఎం ప్రశంసించారు.

