Hyderabad News:

Hyderabad News:హైద‌రాబాద్‌లో 17, 18 తేదీల్లో నీటిస‌ర‌ఫ‌రాలో అంత‌రాయం.. ఆయా ప్రాంతాలు ఇవే..

Hyderabad News:హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి తాగునీటి స‌ర‌ఫ‌రాలో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో (ఫిబ్ర‌వ‌రి 17, 18 తేదీల్లో) తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. గోదావరి డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై ఫేజ్‌-1లోని కొండ‌పాక పంపింగ్ స్టేష‌న్ వ‌ద్ద ఉన్న 3,000 ఎంఎం డ‌యా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డ‌యా వాల్వ్‌లు (బీఎఫ్ అండ్ ఎన్ార్వీ) అమ‌ర్చ‌నున్నారు. ఆయా ప‌నులు ఫిబ్ర‌వ‌రి 17న సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు అంటే ఫిబ్ర‌వ‌రి 18న మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఈ 24 గంట‌ల్లో కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ది. అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాల ప్ర‌జ‌లు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని అధికారులు కోరారు.

అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు ఇవే..
1) ఓ అండ్ ఎం డివిజ‌న్ 6: ఎస్ఆర్ న‌గ‌ర్‌, స‌న‌త్‌న‌గ‌ర్‌, బోర‌బండ‌, ఎస్పీఆర్ హిల్స్‌, ఎర్ర‌గ‌డ్డ‌, బంజారాహిల్స్‌, వెంగ‌ళ్‌రావున‌గ‌ర్‌, ఎల్లారెడ్డిగూడ‌, సోమాజిగూడ‌, ఫ‌తేన‌గ‌ర్‌.
2) ఓ అండ్ ఎం డివిజ‌న్ 9) : కూక‌ట్‌ప‌ల్లి, భాగ్య‌న‌గ‌ర్‌, వివేకానంద‌న‌గ‌ర్‌, ఎల్ల‌మ్మబండ‌, మూసాపేట‌, భ‌ర‌త్‌న‌గ‌ర్‌, మోతీన‌గ‌ర్, గాయ‌త్రీన‌గ‌ర్‌, బాబాన‌గ‌ర్‌, ఏపీహెచ్‌బీ, బాలాజీన‌గ‌ర్‌, హ‌స్మత్‌పేట‌
3) ఓ అండ్ ఎం డివిజ‌న్ 12: చ‌ఇంత‌ల్‌, సుచిత్ర‌, జీడిమెట్ల‌, షాపూర్‌న‌గ‌ర్‌, గాజుల రామారం, సూరారం, ఆద‌ర్శ్‌న‌గ‌ర్‌, భ‌గ‌త్‌సింగ్‌న‌గ‌ర్‌, జ‌గ‌ద్గిరిగుట్ట‌, ఉషోద‌య‌.
4) ఓ అండ్ ఎం డివిజ‌న్ 13: అల్వాల్‌, ఫాద‌ర్ బాల‌య్య‌న‌గ‌ర్‌, వెంక‌టాపురం, మచ్చ‌బొల్లారం, డిఫెన్స్ కాల‌నీ, వాజ్‌పేయి న‌గ‌ర్‌, యాప్రాల్‌, చాణిక్య‌పురి, గౌత‌మ్‌న‌గ‌ర్‌, సాయినాథ‌పురం
5) ఓ అండ్ ఎం డివిజ‌న్ 14: చ‌ర్ల‌ప‌ల్లి, సాయిబాబాన‌గ‌ర్‌, రాధిక‌
6) ఓ అండ్ ఎం డివిజ‌న్ 15: కొండాపూర్‌, డోయెన్స్‌, మాధాపూర్ (కొన్నిప్రాంతాలు)
7) ఓ అండ్ ఎం డివిజ‌న్ 17 : హ‌ఫీజ్‌పేట‌, మియాపూర్‌
8) ఓ అండ్ ఎం డివిజ‌న్ 21: కొంప‌ల్లి, గుండ్ల‌పోచంప‌ల్లి, తూంకుంట‌, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌, ద‌మ్మాయిగూడ‌, నాగారం
9) ఓ అండ్ ఎం డివిజ‌న్ 22 : నిజాంపేట‌, బాచుప‌ల్లి, ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, గండిమైస‌మ్మ‌, తెల్లాపూర్, బొల్లారం
10) ట్రాన్స్‌మిష‌న్ డివిజ‌న్ 4: ఎంఎఈఎస్, త్రిశూల్ లైన్స్‌, గ‌న్ రాక్‌, హ‌కీంపేట‌, ఎయిర్‌ఫోర్స్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌.
11) ఆర్ డ‌బ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు : ప్ర‌జ్ఞాపూర్ (గ‌జ్వేల్‌), ఆలేరు (భువ‌న‌గిరి), ఘన్‌పూర్ (మేడ్చ‌ల్‌/
శామీర్‌పేట‌.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vanamahotsavam 2025: రేపటి నుంచి 'వన మహోత్సవం'..వ్యవసాయ వర్సిటీలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *