Hyderabad News:హైదరాబాద్ నగరంలో ఆదివారం (మే 18) పోలీసులు కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో కంటెస్టెంట్లు ఈ రోజు సెక్రటేరియట్‌ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను మళ్లించనున్నారు. ఈ విషయంలో ప్రయాణికులు సహకరించాలని పోలీసులు కోరారు.
Hyderabad News:సచివాలయం జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ వైపు, లిబర్టీ నుంచి వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. సండే ఫన్‌డే ఈవెంట్ కోసం ట్యాంక్‌బండ్ రూట్ మూసే ఉంటుంది. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.