Hyderabad News: హైదరాబాద్ నగరంలో అలజడి రేగింది. భారీ పేలుళ్లకు దుండగులు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ యుద్ధంతో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులపై భద్రతా దళాలు, ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఈ దశలో హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను పసిగట్టడంతో పేలుళ్ల కుట్రను పోలీసులు ఛేదించారు.
Hyderabad News: ఏపీలోని విజయనగర జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ ఇద్దరూ కలిసి పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కీలక ఆపరేషన్ చేసింది. నగరంలో వింధ్వంసాలకు కుట్ర చేసిన సిరాజ్, సమీర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం.
Hyderabad News: పేలుళ్ల కుట్రకు ప్లాన్ చేసిందెవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఈ ఇద్దరేనా? వీరితోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాదుల కోణంలో వారిని అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం అసలు విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.