Hyderabad News: హైదరాబాద్ మహానగరంలో మరో నాలా కుంగింది. ఏకంగా వాటర్ ట్యాంకర్ ఆ నాలాలో దిగబడింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్‌లోని ఓ రోడ్డుపై ఈ ఘటన మంగళవారం (ఆగస్టు 5) చోటుచేసుకున్నది. గతంలో పాత బస్తీలోని పలుచోట్ల నాలాలు కుంగిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా పసిగట్టలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Hyderabad News: బంజారాహిల్స్ రోడ్డు నంబర్-1లోని మహేశ్వరి చాంబర్స్‌లో వాటర్ ట్యాంకర్ రాగానే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నాలాపై చాంబర్‌పైకి దూసుకెళ్లడంతో అది ఒక్కసారిగా కుంగిపోయింది. దానిలో వాహనం పూర్తిగా ఒరిగి ఇరుక్కుపోయింది. ఇలాంటి నాలా చాంబర్లు నగరంలో పలుచోట్ల ఉన్నాయి. వాటిని మరింత పటిష్ఠంగా చేయాలని నగరవాసులు కోరుతున్నారు.