Hyderabad: కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్

Hyderabad: తెలంగాణ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం డీజీగా పనిచేస్తున్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఆయన పదవీ విరమణతో ఖాళీ అయిన ఆ స్థానం విక్రమ్ సింగ్ మాన్‌కు అప్పగించారు.

విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కొత్త ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sukumar: చరిత్ర సృష్టించిన సుకుమార్.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *