Hyderabad Metro:హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికులకు శుభవార్త అందింది. మెట్రో సేవలను పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాత్రి 11.45 గంటల వరకు మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకే చివరి రైలు ఉన్నది. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి 12.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
Hyderabad Metro:ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కొత్త వేళలు అమలులో ఉంటాయి. శని, ఆదివారాల్లో మాత్రం పాత వేళలే కొనసాగుతాయి. టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. శని, ఆదివారాల్లో మాత్రం మొదటి రైలు ఉదయం 7 గంటలకు మొదలవుతుంది.
Hyderabad Metro:మెట్రోలో ప్రయాణించే విద్యార్థులకు కూడా ఉన్న ఆఫర్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 20 ట్రిప్పులతోనే విద్యార్థులు 30 ట్రిప్పులను పొందే ఆఫర్‌ను పొడిగించారు. ఈ ఆఫర్ 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉండనున్నది. అదే విధంగా 2024 ఏప్రిల్‌లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.