విస్తరిస్తున్న మూడు కీలక మార్గాలు
-
జేబీఎస్ – మేడ్చల్ (24.5 కి.మీ):
తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆంక్షల దృష్ట్యా జేబీఎస్ నుంచి ఈ మార్గాన్ని తక్కువ ఎత్తులో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. -
జేబీఎస్ – శామీర్‌పేట్ (22 కి.మీ):
కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట మార్గంగా శామీర్‌పేట వరకు మెట్రో నిర్మించనున్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో భద్రతా కారణాల వల్ల దాదాపు 1.5 కిలోమీటర్ల భూగర్భ మార్గాన్ని ఈ డీపీఆర్‌లో ప్రతిపాదించారు. మెట్రో రైలు రన్‌వే కిందుగా సాగేలా ప్రత్యేక డిజైన్ చేశారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ – ఫ్యూచర్ సిటీ (40 కి.మీ):
ఈ మార్గంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్ భూగర్భంగా ఉంటే, రావిర్యాల వరకు ఎలివేటెడ్‌గా రైలు నడవనుంది. అక్కడి నుంచి ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో మరో 18 కి.మీ భూగర్భ మార్గంగా అభివృద్ధి చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Jairam Ramesh: విదేశాంగ మంత్రి ఎక్కడ… జైశంకర్ మౌనంపై కాంగ్రెస్ ప్రశ్నలు
జేబీఎస్‌ను కీలక రవాణా కేంద్రంగా అభివృద్ధి
ఈ మూడు మార్గాల ప్రారంభ బిందువుగా జేబీఎస్ స్టేషన్ పనిచేస్తుంది. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కీలక ఇంటర్‌చేంజ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో నగరంలో మెట్రో రవాణా మరింత సమర్ధవంతంగా మారనుంది.
నిధుల సమీకరణ – కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యం
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు, కేంద్ర ప్రభుత్వం 18 శాతం నిధులు సమకూర్చనుండగా, బ్యాంకుల ద్వారా 48 శాతం రుణంగా సేకరించనున్నారు. మిగిలిన 4 శాతం నిధులను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) మోడల్ ద్వారా సమీకరించనున్నారు.
డబుల్ డెక్ ప్రణాళికకు చుక్కెదురు
ప్రాథమికంగా జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట్ మార్గాల్లో డబుల్ డెక్ నిర్మాణం అనాలోచించారు. ఒకే స్తంభంపై కింద రహదారి, పైన మెట్రో రైలు ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే, స్టేషన్లు అధిక ఎత్తులో ఉండటం వల్ల ప్రయాణికులకు అసౌకర్యంగా ఉండే ప్రమాదం ఉండటంతో ఆ ప్రణాళికను విరమించారు.
ప్రాజెక్టుకు శాసన, కార్యనిర్వాహక ఆమోదం కుదురుతున్న దశ
ఈ డీపీఆర్‌లను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు ఇప్పటికే ఆమోదించగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో పెట్టింది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు. ఆపై కేంద్ర ప్రభుత్వానికి సమర్పణ జరగనుంది.