Hyderabad Metro:హైదరాబాద్ మహానగరంలో మెట్రో రెండో దశ నిర్మాణానికి పారిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 196ను శనివారం విడుదల చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల మేర వ్యయం అవుతుందని నిర్ణయించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313 కోట్లు కాగా, కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లు ఉండనున్నది.
మెట్రో రెండో దశలో నిర్మించే కారిడార్లు ఇవే..
కారిడార్ -4: నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (36.8 కి.మీ.)
కారిడార్ -5 : రఆయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.)
కారిడార్ -6 : ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.)
కారిడార్ -7 : మియాపూర్ నుంచి పటాన్‌చెరు (13.4 కి.మీ.)
కారిడార్ -8 : ఎల్పీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు (7.1 కి.మీ.)
కారిడార్ – 9 : శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు