Hyderabad:

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా సీఐల బ‌దిలీలు

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో పోలీస్ శాఖ ప‌రిధిలో భారీగా బ‌దిలీలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లోని స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ల (సీఐలు)ను బ‌దిలీ చేస్తూ హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీపీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు. సైబ‌ర్ క్రైమ్, ఇత‌ర విభాగాల్లో ప‌నిచేస్తున్న‌ 54 మంది సీఐల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. పెద్ద ఎత్తున సీఐల‌ బ‌దిలీలు జ‌ర‌గ‌డం ఇదే ప్ర‌థ‌మం అని పోలీస్ శాఖ‌లో టాక్ వినిపిస్తున్న‌ది.

Hyderabad: హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఎస్‌హెచ్‌వోలుగా ప‌నిచేస్తున్న వారినీ, డీఐలు, సైబ‌ర్ క్రైమ్‌, సీసీఎస్‌లో ప‌నిచేస్త‌న్న వారికి సీపీ స‌జ్జ‌నార్ స్థాన‌చ‌ల‌నం క‌ల్పించారు. మొత్తం 54 మందిని బ‌దిలీ చేశారు. వీరిలో సైబ‌ర్ క్రైమ్స్‌, సీసీఎస్ విభాగాల‌కు చెందిన వారు ఎక్కువ మంది ఉండ‌టం గ‌మ‌నార్హం.

Hyderabad: బ‌దిలీ అయిన 54 మంది పోలీస్ అధికారుల్లో 26 మంది సీఐల‌ను సీపీ కార్యాల‌యంలో త‌క్ష‌ణ‌మే రిపోర్టు చేయాన‌లి సీపీ ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిసింది. సైబ‌ర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా.. ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టే సంక‌ల్పంతో సీపీ ఈ చ‌ర్య‌లు తీసుకున్నార‌ని తెలుస్తున్న‌ది. సీసీఎస్‌, సైబ‌ర్ క్రైమ్ విభాగాల‌ను బ‌లోపేతం చేసేందుకే కీల‌క స్టేష‌న్ల‌లోని ఎస్‌హెచ్‌వోల‌ను సైతం బ‌దిలీ చేసిన‌ట్టు స‌మాచారం. దీంతోపాటు త్వ‌ర‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నందున కూడా ఈ చ‌ర్య‌లు దోహ‌ద‌ప‌డుతాయ‌ని పోలీస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *