Hyderabad:

Hyderabad: హైద‌రాబాద్ హోట‌ల్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో రోజుకో ప్రాంతంలో భారీ అగ్నిప్ర‌మాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్ల‌లో ఈ ప్ర‌మాదాలు నిత్య‌కృత్య‌మ‌వుతున్నాయి. తాజాగా బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటాక హైద‌రాబాద్ న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లిలోని ఓ హోట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. ఈ స‌మ‌యంలో మంట‌లు చెల‌రేగాయి. అర్ధ‌రాత్రి పూట ఈ మంట‌ల‌తో స్థానికులు భీతిల్లిపోయారు. ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కున్నా భారీ ఆస్తిన‌ష్టం సంభ‌వించింది.

Hyderabad: హైద‌రాబాద్ కేపీహెచ్‌బీ కాల‌నీ ప‌రిధిలోని కంచుకోట టిఫిన్ సెంట‌ర్‌లో ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. మంట‌లు చెల‌రేగి ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించాయి. ఈ లోగా స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్ర‌మాదంలో హోట‌ల్ ఫ‌ర్నిచ‌ర్ పూర్తిగా ద‌గ్ధ‌మైంది. రెండు బైక్‌లు కాలిపోయాయి. ఇత‌ర విలువైన సామ‌గ్రి కాలిబూడిదైంది. భారీ ఆస్తిన‌ష్టం జ‌రిగింద‌ని హోట‌ల్ య‌జ‌మాని తెలిపారు.

Hyderabad: ఈ హోట‌ల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. భ‌వ‌నంలోని షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల జ‌రిగిందా? గ్యాస్ లీకై మంట‌లు అంటుకున్నాయా? మ‌రే కార‌ణ‌మైనా అయి ఉంటుందా? అన్న కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఆయా కోణాల్లోనే నిర్వాహ‌కుల‌ను విచారిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *