Hyderabad:

Hyderabad: హైద‌రాబాద్ కాటేదాన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలోని కాటేదాన్ పారిశ్రామికవాడ‌లో మ‌రో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ పరిధిలోని టాటాన‌గ‌ర్ ప‌రిధిలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికంగా ఉన్న ప్లాస్టిక్ ప‌రిశ్ర‌మ‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణన‌ష్టం త‌ప్పింది.

Hyderabad: అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకొని ప‌రిశీలించారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే అగ్నిప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తంచేశారు. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో మంట‌లు ఒక్క‌సారిగా ఎగిసిప‌డ్డాయి. ద‌ట్టంగా ఆప్రాంత‌మంతా పొగ క‌మ్ముకున్న‌ది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో భారీగా ఆస్తిన‌ష్టం సంభ‌వించిన‌ట్టు తెలుస్తున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *