Hyderabad: కెసిఆర్ ఇంటి వద్ద విచారణ..?

Hyderabad: హైదరాబాద్ నంది నగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి పోలీసులు మరోసారి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సిట్ విచారణ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్‌ను నంది నగర్‌లోనే విచారించే అవకాశం ఉన్నందున, అక్కడ భద్రత ఎలా నిర్వహించాలి అనే విషయంపై పోలీసులు సమీక్ష చేస్తున్నారు.

ఇదే కేసులో ఇప్పటికే కేసీఆర్ పర్సనల్ అసిస్టెంట్‌కు (పీఏ) సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత వేగంగా సాగుతుండటంతో రాజకీయంగా కూడా ఈ విషయం పెద్ద చర్చగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *