Hyderabad: కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2020లో నమోదైన జన్వాడ డ్రోన్ కేసులో ఊరట పొందారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో 2020 మార్చిలో నమోదైన ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది.
ఎఫ్ఐఆర్ క్వాష్ కోరిన రేవంత్
రేవంత్ రెడ్డి 2020లో FIRను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ అప్పట్లో రేవంత్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, డ్రోన్ ఎగురవేసిన ప్రదేశం నిషిద్ధ జాబితాలో లేదని కోర్టుకు వివరించారు.
పీపీ వాదనలు – హైకోర్టు తీర్పు
ప్రాసిక్యూటింగ్ పార్టీ (PP) కూడా ఈ విషయాన్ని స్పష్టంగా అంగీకరించింది. ఈ మేరకు హైకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో రేవంత్ రెడ్డికి మరో కేసు నుంచి విముక్తి లభించింది.
ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి ఊరటలభించగా, ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

