Crime News

Crime News: వదినతో అక్రమసంబంధం..భార్యను హత్య చేసిన భర్త?

Crime News: ఖమ్మం జిల్లాలోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఒక గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె భర్త అనైతిక సంబంధాల వల్ల ఆమె బలైపోయినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మూడు సంవత్సరాలుగా సాగుతున్న మాయలో జీవితం

అనిల్ కుమార్ అనే వ్యక్తి డీజీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య సాహితితో కలిసి హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌లో నివాసముండేవాడు. మొదట్లో వీరి జీవితం సాఫీగా సాగింది. కానీ కొంత కాలంగా అనిల్ తీరు మారుతూ వస్తుంది.

అతడు తన భార్య సాహితి అక్క స్వాతిపై కన్నేశాడు. అప్పటికే స్వాతి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అనిల్ ఆమెతో సహజీవనం ప్రారంభించాడు.

ఎమోషనల్ బ్లాక్ మెయిల్, అక్క చెల్లెల మద్య దుర్గతులు

స్వాతి ఎన్నిసార్లు ఈ బంధాన్ని విడిచిపెట్టాలన్నా, అనిల్ వినలేదు. ‘‘నువ్వు నా కోరిక తీరిస్తేనే నీ చెల్లితో కాపురం కొనసాగిస్తాను’’ అంటూ ఆమెను మానసికంగా బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా గత మూడు సంవత్సరాలుగా ఈ అసాధారణ సంబంధం కొనసాగుతూ వచ్చింది.

ఇది కూడా చదవండి: Case on Naa Anveshana: డీజీపీపై వ్యాఖ్యలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు

ఈ విషయాన్ని సాహితి గమనించిన తరువాత, భర్తతో తరచూ వాగ్వాదాలు జరగటం మొదలయ్యాయి. సొంత అక్కతోనే భర్త సహజీవనం చేస్తున్న విషయం ఆమెను లోలోపల కరిగిస్తోంది. కానీ ఈ దుస్థితిలో ఏమీ చేయలేని స్థితిలో మిగిలిపోయింది.

సహించలేని ఒత్తిడికి చివరికి బలైపోయిన సాహితి

ఇటీవల సాహితి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం అనిల్ కుమార్ తన భార్య గుండెపోటుతో మృతి చెందిందని ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వస్థలమైన ఖమ్మంకు తీసుకొచ్చారు.

అయితే మృతదేహంపై గాయాల మచ్చలు కనిపించడంతో, ఆమె తల్లిదండ్రులు అనుమానంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను అనిల్ కుమారే కొట్టి చంపాడని ఆరోపించారు.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సాహితి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజాలు వెలుగులోకి రావాల్సిన సమయం ఆసన్నమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *