Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 16,448 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పోస్టులన్నీ ఇటీవల ప్రారంభమైన కొత్త మెడికల్ కాలేజీలు మరియు వాటికి అనుబంధ ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పోస్టుల విభజన విధంగా:
కాంట్రాక్ట్ ప్రాతిపదికన: 4,772 పోస్టులు
ఔట్ సోర్సింగ్ విధానంలో: 8,615 పోస్టులు
గౌరవ వేతన పద్ధతిలో: 3,056 పోస్టులు
MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) ప్రాతిపదికన: 5 పోస్టులు
ఈ భారీ నియామకాలతో రాష్ట్రంలోని అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. త్వరలోనే నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు విడుదలయ్యే అవకాశముంది.