Hyderabad: వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో సందడిగా కొనసాగుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా భక్తులు గణనాథుని విగ్రహాలను వినూత్న రీతుల్లో ప్రతిష్టించి తమ భక్తిని చాటుకుంటున్నారు. అదే క్రమంలో హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అఘాపురాలో ఓ ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.
ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం.. సాధారణ విగ్రహం కాదు, సీఎం రేవంత్ రెడ్డిని పోలిన లుక్‌తో తీర్చిదిద్దారు. సీఎం తరహా విగ్రహాన్ని చూడటానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన కుటుంబ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.

