Hyderabad: హైప్రొఫైల్ ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వివాదాస్పదమైన ఈ కేసులో మొత్తం ఏడుగురిపై విచారణ కొనసాగగా, కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో ఇప్పటికే ఒకరు మరణించగా, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అలాగే, 2004 నుంచి 2009 వరకు గనులశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డికి, మాజీ మంత్రి కృపానందరెడ్డికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
శిక్ష విధించిన వారు:
1. గాలి జనార్ధన్ రెడ్డి – ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అధినేత
2. బీవీ శ్రీనివాస్ రెడ్డి – OMC కంపెనీ డైరెక్టర్
3. వీడీ రాజగోపాల్
4. గాలి పీఏ మెఫజ్ అలీఖాన్
5. OMC కంపెనీ
కోర్టు ప్రధానంగా ఏ1 శ్రీనివాస్ రెడ్డి మరియు గాలి జనార్ధన్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పుతో పాటు మిగిలిన దోషుల శిక్షల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికావొచ్చు.

