Hyderabad: కొన్ని కొన్ని ఆనందాలు..విషాదాలుగా మారిపోతాయి. ఆనందంగా ఉన్నాము అని అనుకునేలోపే …ఆ ఆనందాన్ని యముడు వచ్చి లాక్కెళ్లిపోతాడు. ఏ మాత్రం అనుకోని సంఘటనలు..కొన్ని కొన్ని సార్లు ఇలా జరిగిపోతున్నాయి. విహార యాత్ర విషాద యాత్రగా మారిపోతే…చెప్పలేని ..బాధ. అలాంటి ఒక సంఘటనే ఇపుడు జరిగింది. కాళ్ళ ముందే ఆ అమ్మాయి చనిపోయింది.
వృత్తిపరంగా రోజూ పని ఒత్తిడికి గురయ్యే చాలా మంది.. అప్పుడప్పుడు విధుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని వివాహయాత్రలకు వెళ్లి రీఫ్రెష్ అవుతుంటారు. మానసిక ఉల్లాసాన్ని పొంది.. రెట్టింపు ఉత్సాహంతో తిగిరి విధులు నిర్వహిస్తుంటారు. అటు మెదడుకు, ఇటు మనసుకు రిఫ్రెషింగ్‌గా ఉంటుందని వెళ్లే కొన్ని విహారయాత్రలు ఒక్కోసారి విషాదంగా మారుతుంటాయి. అచ్చంగా అలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యుల బృందం సరదాగా చేపట్టిన విహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమార్తె, యువ వైద్యురాలు అనన్య రావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితతో కలిసి కర్ణాటకలోని హంపీకి టూర్‌కు వెళ్లారు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలను చూసిన వీళ్లు.. సణాపుర గ్రామంలోని ఓ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో తుంగభద్ర నదికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనన్యరావు.. సరదాగా ఈత కొట్టాలనుంది. అందుకోసం.. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నదిలో దూకింది.
Also Read: Jharkhand Science Paper Leak: 10వ తరగతి సైన్స్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం
కాసేపు సరదాగా ఈత కొడుతూ ఆనందించిన అనన్యరావు.. కాసేపటికే నదిలో నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయింది. అనన్యరావు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్నేహితులు.. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ.. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే.. అనన్యరావు కనిపించకుండాపోయింది. అప్రమత్తమైన ఆమె స్నేహితులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే వారు అక్కడకు చేరుకుని దాదాపు మూడు గంటల పాటు తుంగభద్ర నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ కుమార్తె అనన్యరావు. ఆమె కూడా డాక్టర్ చదవు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి విహారయత్రకు వెళ్లిన అనన్యరావు ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మృతి సమాచారం తెలుసుకున్న అనన్యరావు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరదాగా స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.