Hyderabad:

Hyderabad:హైద‌రాబాద్‌లో డేంజ‌ర్ బెల్స్‌! ప‌డిపోయిన గాలి నాణ్య‌త‌

Hyderabad:దేశంలోనే అత్యంత నివాస యోగ్య‌మైన మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల్లో ఒక‌టిగా నిలిచిన‌ హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఇప్పుడు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. న‌గ‌రం ప‌రిధిలో గాలి నాణ్య‌త ప్ర‌మాద‌క‌ర స్థాయిలో దారుణంగా ప‌డిపోతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఢిల్లీని వెంటాడిన ఆ ప్ర‌మాదం.. ఇప్పుడు హైద‌రాబాద్‌ను వెన్నాడుతున్న‌ది.

Hyderabad:గాలి నాణ్య‌త విష‌యంలో బెంగ‌ళూరు, చెన్నై వంటి మెట్రోపాలిటన్ న‌గ‌రాల‌ను కూడా దాటి హైద‌రాబాద్ న‌గ‌రం దాటిపోయింది. ఇప్పుడు మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతున్న వైనం ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. గాలి నాణ్య‌త సూచీ ప్ర‌కారం.. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం 10 క‌ణాలు అనుమ‌తించ‌ద‌గిన స్థాయి కంటే 3 నుంచి 4 రెట్లు అధికంగా న‌మోద‌వుతున్న‌ట్టు పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు తాజాగా వెల్ల‌డించింది.

Hyderabad:ఇటీవ‌ల సికింద్రాబాద్ ప‌రిధిలో గాలి నాణ్య‌త సూచీ అత్యంత ప్ర‌మాద‌క‌రంగా 240కి చేరుకున్న‌ట్టు పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య తీవ్ర‌త అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఉన్న‌ద‌ని పేర్కొన్న‌ది. ఈ ఆధారంగా ప్ర‌మాద‌క‌ర స్థాయిలో గాలి నాణ్య‌త ప‌డిపోవ‌డంతో న‌గ‌ర‌వాసుల‌కు ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది. ముఖ్యంగా న‌గ‌రంలో వాహ‌నాల సంఖ్య పెరగ‌డం, వాటి నుంచి వెలువ‌డే పొగ‌, ప‌రిశ్ర‌మ‌ల కాలుష్యం, నిర్మాణాల నుంచి వెలువ‌డే ధూళి, నీటి కాలుష్యంతో గాలిలో నాణ్య‌త మ‌రింత ప‌డిపోతున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *