Hyderabad: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా మూతపడ్డ లేదా ఆందోళనలో ఉన్న విద్యాసంస్థలు రేపటి నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి.
ప్రభుత్వం ఈ వారం లోపలే రూ.600 కోట్లు విడుదల చేస్తామని, దీపావళి నాటికి మరో రూ.600 కోట్లు చెల్లిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని మార్చుకుని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తరగతులను కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోగా, విద్యాసంస్థల నిర్వాహకులు ప్రభుత్వం ఇచ్చిన హామీని స్వాగతించారు.