Hyderabad: హైదరాబాద్ నగరంలో మూడు నెలల క్రితం చెరువుల, మూసీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో ఉన్న ఇండ్ల కూల్చివేతలకు దిగిన బుల్డోజర్.. తాజాగా ఫుట్‌పాత్‌లపై చిరు దుకాణాలపై తన పంజా విసురుతున్నది. బుధవారం హైదరాబాద్ నగర పరిదిలోని కొత్తపేటలో ఫుట్‌పాత్‌లపై ఉన్న చిరు దుకాణాలను పోలీసులు తొలగిస్తున్నారు. ఎల్‌బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ కవేటర్‌తో దుకాణాలను తొలగిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో చిరు వ్యాపారులు లబోదిబోమంటూ ఆందోళనకు దిగారు.
Hyderabad: తమ సామగ్రిని తీసుకుంటామన్నా పోలీసులు వినడం లేదని బాధిత చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం కుటుంబాలకు జీవనాధారమైన ఫుట్‌పాత్ వ్యాపారం పోతే తమ కుటుంబాలు ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు. కొంతకాలమైనా గడువు ఇవ్వకుండా ఉన్నఫలంగా తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇండ్లను వదిలి దుకాణాలపై బుల్డోజర్ తన ప్రతాపం చూపుతుంది.. అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.