Hyderabad:

Hyderabad: హైద‌రాబాద్ వ‌ర్షాల‌కు గ‌ల్లంతైన‌ వ్య‌క్తి మృత‌దేహం రెండు వారాల‌కు ల‌భ్యం

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో కురిసిన వ‌ర్షాలకు కొట్టుకుపోయిన ఇద్ద‌రిలో ఓ వ్య‌క్తి మృత‌దేహం ఎట్ట‌కేల‌కు 13 రోజుల త‌ర్వాత ల‌భ్య‌మైంది. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు న‌గ‌రంలోని హ‌బీబ్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అఫ్జ‌ల్‌న‌గ‌ర్ ప్రాంతంలో మామా అల్లుళ్లు అయిన అర్జున్‌, రామ అనే వ్య‌క్తులు వ‌ర‌ద నీటిలో గ‌ల్లంత‌య్యారు. వారికోసం ఎంత‌గా వెతికినా ఆచూకీ దొర‌క‌లేదు.

Hyderabad: వర‌ద‌నీటిలో గ‌ల్లంతైన ఆ ఇద్ద‌రిలో అర్జున్ మృత‌దేహం మూసీ న‌ది 75 కిలోమీట‌ర్ల దూరంలోని వ‌లిగొండ ప‌రిస‌రాల్లో ఇటీవ‌లే ల‌భించింది. రామ మృత‌దేహం కోసం ఎంత‌గా వెతికినా ఆచూకీ దొర‌క‌లేద‌ని కుటుంబ స‌భ్యులు ల‌బోదిబోమంటుండ‌గా, హైదరాబాద్ న‌గ‌రంలోని నాగోల్ మూసీలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృతదేహం ఉన్న‌ద‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది. నాగోల్ వ‌ద్ద మూసీలో క‌నిపించిన మృత‌దేహం రామ‌గా పోలీసులు గుర్తించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *