Hyderabad: గోవా.. పర్యాటకులకు భూలోక స్వర్గం అని భావిస్తారు. ఎంజాయ్ చేసేందుకు సరైన లొకేషన్‌గా పర్యాటకులు గుర్తిస్తారు. వేసవిలో, శీతాకాలంలో అక్కడికి వెళ్లి కొద్దిరోజులు ఉండి ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఇక్కడికి దేశం నుంచే కాదు.. విదేశీల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. గోవాకు ప్రేమ జంటలు, ఫ్యామిలీ జంటలు వెళ్లి వస్తుంటారు. అయితే అక్కడ దిగే హోటల్స్ యాజమానులు, ఇతర మధ్యవర్తులతో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. అక్కడికి వెళ్లొచ్చిన ఓ యువతికి ఎదురైన ఓ చేదు అనుభవమే అందుకు నిదర్శనమని భావిస్తున్నారు.
Hyderabad: గోవాకు వెళ్లిన ప్రేమ జంటల పొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసే దందా సాగుతుందని ఇటీవల వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన పెళ్లికి ముందు ఓ వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లొచ్చింది. వారికి గోవాలో వసతి, భోజనం ఏర్పాట్లను యశ్వంత్ అనే వ్యక్తి చేశాడు. వారిని నమ్మిన వ్యక్తిగా నమ్మబలికి అన్ని సదుపాయాలు చేసి పెట్టాడు. ఇది జరిగింది 2023లో.. అంటే రెండేండ్లు దాటింది. సీన్ కట్ చేస్తే..
Hyderabad: ఇటీవలే ఆ మహిళకు యశ్వంత్ అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. గోవా వచ్చిన మీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు తీశానని, అవి తన వద్ద ఉన్నాయని బెదిరింపులకు దిగాడు. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు వేరే వ్యక్తితో పెళ్లయిందని, తన వైవాహిక జీవితాన్ని చెడగొట్టొద్దని వేడుకున్నది. అయినా ససేమిరా అన్నాడు. ఇక చేసేదేమీలేక ఆ మహిళ నగర పోలీసులను ఆశ్రయించింది. చూశారా! గోవా వెళ్తే.. అక్కడి వారిని గుడ్డిగా నమ్మకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిందే..

