Indian Racing League 2024: ఇండియన్ రేసింగ్ లీగ్ ఫెస్టివల్‌లో భాగంగా జరిగిన ఎఫ్4 ఛాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అకీల్ అలీ భాయ్ 2024 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి రెండు రేసుల్లో అతను వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచినప్పటికీ ఓవరాల్‌గా 282 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచాడు. ఎఫ్4 టీమ్ టైటిల్ కూడా బ్లాక్‌బర్డ్స్ సొంతం చేసుకుంది. జట్టు యజమాని అక్కినేని నాగచైతన్య ఈ ట్రోఫీ అందుకున్నాడు260 పాయింట్లతో రాయల్ బెంగాల్ టైగర్స్ రేసర్ రుహాన్ అల్వా రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఇండియన్ రేసింగ్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను గోవా ఏసెస్ జేఏ రేసింగ్ 167 పాయింట్లతో తమ ఖాతాలో వేసుకుంది.

