Hyderabad:

Hyderabad: హైద‌రాబాద్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో దారుణం

Hyderabad: విద్యాల‌యాల్లో గురుశిష్యుల బంధానికి విలువ లేకుండా పోతున్న‌ది. ఆనాటి విలువ‌లున్న విద్యాబుద్ధులు నేర్పే ఓపిక గురువుల‌కు ఉండటం లేదు.. నేర్చుకోవాల‌న్న త‌ప‌న ఈనాటి బాల‌ల‌కు ఉండ‌టం లేదు. ఫ‌లితంగా ఎంద‌రో వ‌యోజ‌కులు అయ్యాక దారి త‌ప్పిపోతున్నారు. కానీ, గ‌తంలో రెండు ద‌శాబ్దాల‌కు పూర్వం నేర్చుకున్న విలువ‌లే ఎంద‌రో జీవితాల‌ను ఉన్న‌తులుగా తీర్చిదిద్ది స‌మాజ గ‌మ‌నానికి ఇంకా తోడ్పాటు నందిస్తున్నాయి. కానీ, హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న గురుశిష్యుల బంధానికి మాయ‌ని మ‌చ్చ‌ని తెచ్చి పెడుతున్న‌ది.

Hyderabad: హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ప‌రిధిలోని పేట్ బ‌షీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కొంప‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 7వ త‌ర‌గ‌తి విద్యార్థి సూర్య‌ను అదే పాఠ‌శాల‌లోని 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌తో పాఠ‌శాల ప్రిన్సిపాల్ కృష్ణ‌ కొట్టించారు. దుండిగ‌ల్ మండ‌ల ఇన్‌చార్జి ఎంఈవోగా ప‌నిచేస్తున్న ఆయ‌న.. సూర్య త‌న మాట విన‌డం లేద‌ని విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టించారు.

Hyderabad: సారే చెప్పిండు క‌దా.. అని 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు.. 11 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ఆ బాలుడిని ర‌క్తం వ‌చ్చేలా తీవ్రంగా కొట్ట‌డంతో శ‌రీరంపై తీవ్ర‌మైన గాయాల‌య్యాయి. వీపుపై ద‌ద్దులు తేలాయి. కాలి తొడ భాగంలో గాయాలై ర‌క్తం దార‌లా కారింది. ఈ విషయం తెలిసిన బాధిత విద్యార్థి త‌ల్లిదండ్రులు పాఠ‌శాల ప్రిన్సిపాల్ కృష్ణ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకొని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *