Hyderabad: తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటం, స్థానిక వ్యాపారాలకు రక్షణ కల్పించడం అత్యవసరమని తెలంగాణ కవులు, మేధావులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, హైదరాబాదులో నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని వ్యాపార వాతావరణం ఆరోగ్యకరంగా ఉండాలంటే స్థానిక వ్యాపారులకు ప్రోత్సాహం ఇవ్వాలని,
అన్యాయంగా లేదా అక్రమంగా వ్యాపారం చేసే వారిని చట్టం ముందు నిలబెట్టాలని,
స్థానిక వ్యాపారులను రక్షించడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు
అలాగే, రాష్ట్రంలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, స్థానిక ప్రతిభను గౌరవించాలని సమావేశంలో తీర్మానించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని కూడా కవులు, మేధావులు స్పష్టం చేశారు.