Hyderabad: హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగుతున్నది. జనాభా పెరుగుదల, కాలుష్యం విడుదల, వాహనాల సంఖ్య పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా గాలిలో నాణ్యత తగ్గిపోతున్నది. చలికాలంలో దాని తీవ్రత మరింత పెరుగుతూ వస్తున్నది. తాజాగా ఆదివారం (డిసెంబర్ 28) గాలిలో నాణ్యత 261కి చేరి ఆందోళన కలిగిస్తున్నది.
Hyderabad: చలికాలం కావడంతో పొగమంచు, చెత్త నుంచి వచ్చే ధూళి, వాహనాల నుంచి వెలువడే పొగతో తాజాగా కాలుష్యం పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 300కు చేరువలో ఉండటంపై వారు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే కొనసాగితే ఢిల్లీకి చేరువ అయ్యే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు.
Hyderabad: గాలిలో నాణ్యత తగ్గడంతో మనుషుల్లో శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంటుందని తేల్చి చెప్తున్నారు.
