Hyderabad: తీవ్రమైన పరిస్థితుల్లో మీరు మెడికల్ చెకప్‌కు వెళ్తున్నారా? మరో సెంటర్‌లో కూడా పరీక్షలు చేయించుకొని క్రాస్‌చెక్ చేసుకోండి? లేకుంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. ఇదే సంఘటన ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగింది. ఒక చోట వచ్చిన రిపోర్ట్‌పై అనుమానం వచ్చి, మరో చోట పరీక్షలు చేయించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. లేకుంటే ఆ బాధితురాలి ప్రాణానికే ముప్పు ఏర్పడేది. దీనిపై ఆమె వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో సదరు డయాగ్నోస్టిక్ సంస్థకు జరిమానా విధించింది.
Hyderabad: రంగారెడ్డి జిల్లాకు చెందిన భార్గవి అనే గర్భిణి ఇటీవల గైనకాలజీ వైద్యురాలి సూచన మేరకు హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ పేరున్న డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఎన్టీ స్కాన్ చేయించుకున్నది. ఆమెకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన అక్కడి సిబ్బంది.. అన్నీ సాధారణంగానే ఉన్నాయని ఆమెకు రిపోర్టులు ఇచ్చారు.
Hyderabad: అనుమానం ఉన్న ఆ మహిళ.. మరో డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అదే పరీక్షలు చేయించుకున్నది. అప్పుడు భయంకరమైన నిజం బయటపడింది. ఆమె కడుపులోని శిశువు మెడపై 11 ఎంఎం సిస్ట్ ఉన్నదని అక్కడి ఎన్టీ స్కానింగ్‌లో బయటపడింది. గుండెజల్లుమన్న ఆ బాధితురాలు వెంటనే గైనకాలజీ డాక్టర్‌ను సంప్రదించింది.
Hyderabad: ఆమె తీసుకొచ్చిన స్కానింగ్ రిపోర్టులను పరిశీలించిన వైద్యులు.. శిశువు మెడలపై ఉన్న సిస్ట్‌తో తల్లీబిడ్డలకు ప్రమాదమని, వెంటనే గర్భం తొలగించుకోవాలని సూచించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్సల ద్వారా ఆ మహిళ గర్భాన్ని వైద్యులు తొలగించారు. దీంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అదే మొదటి పరీక్షలతోనే నిర్లక్ష్యంగా ఉండి ఉంటే తల్లీబిడ్డల ప్రాణానికి ముప్పు ఏర్పడేదని చెప్పారు.
Hyderabad: ఈ మేరకు మొదటి ఇచ్చిన తప్పుడు పరీక్షలు, రిపోర్టుల ఆధారంగా వినియోగదారుల కమిషన్‌ను ఆ బాధిత మహిళ ఆశ్రయించింది. ఈ మేరకు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు ఆ కమిషన్ జరిమానా విధించింది. ఆమె చెల్లించిన ఫీజు రూ.1,700తోపాటు ఖర్చుల కింద రూ.20 వేలు, బాధితురాలికి పరిహారంగా రూ.2 లక్షల నగదు చెల్లించాలని తీర్పు వెల్లడించింది. ఇది అటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు, ఇటు బాధిత కుటుంబాలకు కనువిప్పు కలగాలని పలువురు కోరుకుంటున్నారు.
