Hyderabad: తెలంగాణ ప్రభుత్వంలో భారీ ఐఏఎస్ మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రవాణా శాఖ కమిషనర్‌గా కె. ఇలంబర్తిని నియమించారు. అదనంగా, సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
							
