Hyderabad: 77 మంది డీఎస్పీలు బదిలీ

Hyderabad: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో సోమవారం భారీ స్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించగా, మరికొందరిని డీజీపీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు.

పోలీసు పరిపాలనను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న ఈ చర్యల్లో పలువురు ముఖ్యమైన అధికారులకు కీలక పోస్టులు అప్పగించారు. ఇందులో భాగంగా జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవో)గా ఎన్. వెంకటస్వామి నియమితులయ్యారు. అలాగే, ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా డి. రఘుచందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. బాలానగర్ ఏసీపీగా పి. నరేశ్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా వి. శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్ నియమితులయ్యారు. అంతేగాక, మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీగా సుఖ్‌దేవ్ సింగ్, మలక్‌పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, హుస్నాబాద్ ఏసీపీగా సదానందం, గాంధీనగర్ (హైదరాబాద్) ఏసీపీగా ఏ. యాదగిరి బదిలీ అయ్యారు.

ఇక, కొంతమంది అధికారులను వారి ప్రస్తుత పదవుల నుంచి బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో తక్షణమే హాజరుకావాలని ఆదేశించారు. వీరిలో చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేశ్ కుమార్, మేడ్చల్ ఏసీపీ బి. శ్రీనివాస్ రెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీ ఎండీ గౌస్, మలక్‌పేట ఏసీపీ జి. శ్యామ్ సుందర్, హుస్నాబాద్ ఏసీపీ వి. సతీష్‌లు ఉన్నారు. ఈ బదిలీలు పోలీసులు శాఖలో సాధారణ పరిపాలనా విధానంలో భాగంగా నిర్వహించబడినట్లు తెలుస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *