Hyderabad: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మిస్ వరల్డ్ అందాల పోటీలో ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ గెలుపొందారు. ఆమె పేరు ప్రకటించిన వెంటనే, భావోద్వేగానికి లోనైన ఓపల్ ఆనందాశ్రువులతో వేదికపై మెరిశారు. 2025 సంవత్సరానికి గాను ప్రపంచ సుందరి కిరీటం ఆమె సొంతమైంది.
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో 108 దేశాలకు చెందిన సుందరాంగనులు పాల్గొన్నారు. గత సంవత్సరం (2024) మిస్ వరల్డ్‌గా ఎంపికైన చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా, ఓపల్‌కు కిరీటం అలంకరించి, సాంప్రదాయబద్ధంగా అభినందనలు తెలిపారు.
పోటీలో పోలాండ్‌కు చెందిన యువతులు ప్రముఖ స్థానాలను ఆక్రమించడం విశేషం. మిస్ పోలండ్ ఫస్ట్ రన్నర్-అప్‌గా నిలవగా, మరో మిస్ పోలాండ్ సెకండ్ రన్నర్-అప్‌గా ఎంపికయ్యారు. మిస్ మార్టినిక్ మూడో రన్నర్-అప్‌గా నిలిచారు.
విజేతగా ఎంపికైన ఓపల్ సుచాతకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఫుకెట్ నగరంలో జన్మించిన ఆమె థాయ్‌లాండ్‌కు గర్వకారణంగా నిలిచారు.

