Hyderabad:

Hyderabad: మ‌హాన‌గ‌రం మ‌ధ్యన‌ 200 ఫీట్ల రోడ్డు.. ఎక్క‌డి నుంచి ఎక్క‌డి వ‌ర‌కు మీకు తెలుసా?

Hyderabad: హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం రోజురోజుకూ భారీగా విస్త‌రిస్తున్న‌ది. శివారు ప్రాంతాలు ఏటేటా క‌లుస్తున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో 100 కార్పొరేష‌న్ డివిజ‌న్లుగా ఉన్న జీహెచ్ఎంసీ 300 డివిజ‌న్ల‌కు పెంచుతుంది. దీంతో అవుట‌ర్ రింగ్ రోడ్డులోపు ఉన్న ప్రాంతాల‌న్నీ (మున్సిపాలిటీలు, గ్రామ పంచాయ‌తీలు) గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో విలీన‌మ‌వుతున్నాయి. ఈ ద‌శ‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ స‌మ‌స్య ప్ర‌తిబంధ‌కంగా మారింది. దీనికే కొంత‌మేర ఓ ప‌రిష్కారం చూపేందుకు స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Hyderabad: మ‌హాన‌గ‌రం మ‌ధ్య‌లో 200 అడుగుల మేర ప్ర‌ధాన ర‌హ‌దారి నిర్మాణానికి నిర్ణ‌యం తీసుకున్న‌ది. ముఖ్యంగా ఐటీ కారిడార్ భారీగా పెరిగిన ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం భారీ మాస్ట‌ర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్న‌ది. ఈ మేర‌కు షేక్‌పేట నాలా నుంచి మ‌ణికొండ పైపులైన్ రోడ్డు మీదుగా సీబీఐటీ కాలేజీ వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న 60 ఫీట్ల రోడ్డును 200 అడుగుల రోడ్డు మేర‌కు విస్త‌రించాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్టు స‌మాచారం. దీంతో పాటు ఓల్డ్ బాంబే హైవే నుంచి ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు నేరుగా వెళ్లేలా ఎలివేటెడ్ కారిడార్‌ను కూడా నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Hyderabad: ఈ రోడ్ల నిర్మాణం పూర్త‌యితే గ‌చ్చిబౌలి, మ‌ణికొండ ప్రాంతాల మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ది. అత్యంత ర‌ద్దీగా ఉండే మ‌ణికొండ పైపులైన్ రోడ్డు కేవ‌లం 60 ఫీట్ల వెడల్పులోనే ఉన్న‌ది. మ‌ణికొండ‌, పుప్పాల‌గూడ‌, నార్సింగి ప్రాంతాలు గ‌త ఐదేళ్ల‌లో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నిత్యం ఉద‌యం, సాయంత్ర వేళల్లో ఈ రోడ్డుగుండా ఐటీ, ఇత‌ర రంగాల ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున ప్ర‌యాణిస్తూ ఉంటారు. ఈ రోడ్డు ప‌క్క‌న భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, విద్యాసంస్థ‌లు, నివాస స‌ముదాయాలు ఉన్నాయి. 200 మీట‌ర్ల రోడ్డు అందుబాటులోకి వ‌స్తే ఆయా స‌మ‌స్య‌ల‌న్నీ తీరుతాయ‌ని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *