Hyderabad: హైదరాబాద్ కో-లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గ ప్రాంతంలోని ఓ కో-లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గ పరిధిలోని కో-లివ్ గార్నెట్ పీజీలో రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (SOT) పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో MDMA డ్రగ్ సరఫరా చేస్తున్న డ్రగ్ పెడ్లర్లతో పాటు ముగ్గురు డ్రగ్ వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్, 7 గ్రాముల OG కుష్ గంజాయి, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కో-లివింగ్ హాస్టళ్లను కేంద్రంగా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ దందాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *