Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. “ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేస్తాం” అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆఫీస్‌కు వచ్చిన ఈమెయిల్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు ఎయిర్‌పోర్ట్‌లో విస్తృత తనిఖీలు ప్రారంభించాయి.
ఢిల్లీ ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు. షాపింగ్ మాల్స్, దేవాలయాలు, బస్ స్టాప్‌లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి అనుమానాస్పద వస్తువుపై పటిష్ఠ నిఘా కొనసాగుతోంది.
సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు సైబర్ విభాగంతో కలిసి మెయిల్ మూలాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

