Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. గచ్చిబౌలిలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్, అమెరికా నుండి వచ్చిన నీలిమ, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
దాడిలో పోలీసులు 20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల MDMA, 20 NTC మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో డ్రగ్స్‌ను బెంగళూరు నుండి తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విక్రమ్‌ను డిచ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ రవాణా, సరఫరా వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.