జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 81 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, వీరిలో 23 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు.
నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో ఇప్పుడు గుర్తుల కేటాయింపు దశ ప్రారంభమైంది. కాసేపట్లో బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఉప ఎన్నిక గట్టి పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది.

