Hyd: హైదరాబాద్ పంజాగుట్టలో దారుణమైన హత్య జరిగింది, సొంత తాతనే మనవడు హత్యచేసిన సంఘటన. ఈ సంఘటన శోకాన్ని కలిగించింది. మనవడు కీర్తితేజ, అతని సొంత తాత అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్ధనరావును ఆస్తి కోసం 73 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు.
జనార్థనరావును చంపుతుండగా అడ్డొచ్చిన తల్లిని కూడా 12 సార్లు పొడిచాడు. ఆస్తి కోసం కీర్తితేజ తాత జనార్ధనరావును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 73 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు. కంపనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వనివ్వకపోవడమే కీర్తితేజ ఆగ్రహానికి కారణమై, ఈ కోపంతోనే జనార్ధనరావును హత్య చేశాడు.
అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన కీర్తితేజ, తన తాత వీసీ జనార్ధనరావుపై కంపెనీలో డైరెక్టర్ పదవి ఇవ్వాలని ఒత్తిడి పెట్టాడు. కానీ, కీర్తితేజ డ్రగ్స్‌కు బానిసై ఉన్నందున, జనార్ధనరావు అతనికి ఆ పదవి ఇవ్వడాన్ని నిరాకరించాడు. ఈ కారణంగా కోపంతో, కీర్తితేజ తాతను హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత, కీర్తితేజ ఏలూరుకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వెంటనే, కీర్తితేజను ఏలూరులో అరెస్టు చేశారు.

