Husband Abuses Wife: ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే.. మహాలక్ష్మి ఉన్నట్టే అని అంటారు.. అమ్మాయి పుడితే.. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనే వారు. తదనంతర కాలంలో అమ్మాయి పుడితే.. ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పులు.. భ్రూణ హత్యలు.. లింగ వివక్ష జరుగుతోంది.తాజాగా ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఓ భర్త గర్భవతి అయిన తన భార్యను, పిల్లలను అర్ధరాత్రి పుట్టింటికి పొమ్మని ఇంటి నుంచి గెంటేశాడు.
హైదరాబాద్ లోని అత్తాపూర్‌లో దారుణం జరిగింది. మళ్లీ తనకు ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఆ భర్త కట్టుకున్న భార్యను పుట్టింకి పంపివేశాడు. అర్ధరాత్రి అనే కనికరం లేకుండా గర్బవతినీ, తన ఇద్దరు పిల్లలను పుట్టింకి పొమ్మని బయటపెట్టి తలుపువేశాడు. వివాహ సమయంలో పెట్టిన సామాన్లు సయితం అత్త ఇంటికి పంపించివేశాడు. అర్ధరాత్రి తన ఇద్దరి పిల్లతో రోడ్డు పాలైన నిండు చూలాలు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: Gottipati ravikumar: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం
ఆమె అత్తా మామ కూడా కొడుకుకు వత్తాసు పలకడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు హుమేరా బేగం పోలీసులను ఆశ్రయించింది. వివాహం జరిగి నప్పటి నుండి భర్త వేధింపులు మొదలయ్యాయని, మొదటి సారి ఆడపిల్లకు జన్మ నిచ్చిన తరువాత అదనపు కట్నం తేవాలని భర్త అక్బర్ ఖాన్ చిత్ర హింసలకు గురిచేశాడని.. గర్భవతి అయిన రెండు సార్లు పుట్టింకి వెళ్లగొట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.