Minor Girls

Minor Girls: మైనర్ బాలికలను ఎత్తుకెళ్ళి అమ్మేస్తున్నారు.. పట్టుబడ్డ ముఠా!

Minor Girls: పెద్ద వయసు ఉన్న పురుషులకు మైనర్ బాలికలను వివిధ ప్రాంతాల నుంచి ఎత్తుకెళ్ళి అమ్మేస్తున్నారు. ఇటీవల బాలికల మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో పెద్ద వయసు వ్యక్తులకు ఇద్దరు బాలికలను అమ్మే ప్రయత్నం చేశారు దుండగులు. రాష్ట్ర పోలీసుల అప్రమత్తతతో వారిని రక్షించగలిగారు. అస్సాం నుండి కిడ్నాప్ అయిన ఇద్దరు బాలికలను నిన్న రాష్ట్ర పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని కాచార్ జిల్లాలోని ఒక టీ ప్లాంటేషన్ కార్మికుడు జనవరిలో తన 15 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేసి, అదే వయసు గల మరో బాలిక ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిందని, కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చిందని కనుగొన్నారు. ఇటీవల పోలీసులు ఆ అమ్మాయిని ప్రశ్నించారు.

అధిక జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి నన్ను, మరో అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్లి, ఆపై రాజస్థాన్ తీసుకెళ్లారని ఆ అమ్మాయి చెప్పింది. తరువాత అక్కడ పెద్ద వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోమని వాళ్ళు మమ్మల్ని బలవంతం చేశారు. “నేను అక్కడి నుండి తప్పించుకున్నాను” అని ఆమె పోలీసులకు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Sunitha: సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు

ఇది విని షాక్ అయిన అస్సాం పోలీసులు, ఈ విషయంలో రాజస్థాన్ పోలీసుల సహాయం కోరారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఒక గ్రామానికి సమీపంలో ఉన్న లీలా రామ్ ఇంటి నుండి అస్సాం పోలీసులు కిడ్నాప్‌కు గురైన మరో బాలికను రక్షించారు.

లీలా రామ్ ఆ అమ్మాయిని 4 లక్షల రూపాయలకు కొన్నానని చెప్పాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి అస్సాంకు తీసుకువచ్చారు. అదేవిధంగా, అస్సాంలోని శ్రీభూమి జిల్లా నుండి రాజస్థాన్‌లోని మన్పురా ప్రాంతంలో అపహరణకు గురైన ఒక బాలికను అస్సాం పోలీసులు రక్షించారు.

కాచర్ ఎస్పీ నుమల్ మహత్తా మాట్లాడుతూ, “ఈ మానవ అక్రమ రవాణా అస్సాంలోని తేయాకు తోటలలోని గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ప్రధాన నిందితులు బరాక్ లోయకు చెందిన రూపాలి దత్తా, గంగా కంజుగా గుర్తించాం. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసాం. “దీనితో సంబంధం ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తాము” అని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *