War 2: యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న వార్-2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఓ భారీ ట్విస్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ హింట్ ఇస్తోంది.
Also Read: HHVM Success Meet: హరిహర వీరమల్లు సక్సెస్ మీట్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?
క్లైమాక్స్ తర్వాత ఎండ్ టైటిల్స్‌లో ఆలియా భట్, శార్వరి నటించిన ఆల్ఫా చిత్రానికి సంబంధించిన స్పెషల్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం. ఈ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఊహించని థ్రిల్‌ను అందించనుందని, వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఆల్ఫా కథకు లింక్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సర్‌ప్రైజ్‌తో వార్-2 మరింత హైప్‌ను సొంతం చేసుకుంది.

