JACK

JACK: ‘జాక్’ ట్రైలర్ పై భారీ అంచనాలు!

JACK: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘జాక్’ రిలీజ్‌కు రెడీ అయిపోయింది! షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. వేసవి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ను షురూ చేసిన టీమ్.. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ‘జాక్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 2న ట్రైలర్ విడుదల కానుందని తెలిపారు. దీంతో ట్రైలర్ ఎలా ఉంటుంది? ఎలాంటి సంచలనం రేపుతుంది? అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ ఈ సినిమాలో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుందని టీమ్ ధీమాగా చెబుతోంది. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా కనిపించనుండగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కు బ్రేక్ లేకుండా రూపొందిన ఈ సినిమా.. సిద్ధు కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *