Jailer 2

Jailer 2: ‘జైలర్ 2’ రైట్స్ కోసం భారీ డీల్స్!

Jailer 2: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ కేరళలో షూటింగ్ జోరుగా సాగుతోంది. బ్లాక్‌బస్టర్ ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. కోలీవుడ్‌లో ఈ సినిమా క్రేజ్ ఇప్పటి నుంచే ఆకాశాన్ని తాకుతోంది.

షూటింగ్ మధ్యలోనే థియేట్రికల్ రైట్స్ కోసం ఓ బడా నిర్మాణ సంస్థ భారీ ఆఫర్ వేసినట్లు సమాచారం. ఈ స్థాయిలో ఆఫర్ రావడం ‘జైలర్ 2’ రేంజ్‌ను చాటుతోంది. అయితే, మేకర్స్ ఈ ఆఫర్‌ను తిరస్కరించి, షూటింగ్ పూర్తయ్యాక డీల్ కుదుర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

Also Read: Mahesh Babu: SSMB29: మహేష్ బాబు డైనోసర్‌తో ఢీ..!

Jailer 2: ఈ సినిమా రైట్స్ ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తాయో చూడాలి. రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్ గెస్ట్ రోల్‌లో సందడి చేయనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం మరో హైలైట్‌గా నిలవనుంది. ‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం!

జైలర్ 2 – ప్రకటన టీజర్ : 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *