Hrithik Roshan: ‘వార్ 2’.. ఈ పేరు వినగానే బాలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్‌లో జోష్ పీక్స్‌కి వెళ్లిపోతోంది. మాస్ ఐకాన్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ ఎక్స్‌ట్రావగంజా అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందుతోంది. ఈ మూవీ హైప్ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా హృతిక్ ఎన్టీఆర్‌ని మెచ్చుకుంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఓ ఈవెంట్‌లో ‘మీ ఫేవరెట్ కో-స్టార్ ఎవరు?’ అని అడిగితే, హృతిక్ ఒక్క సెకను ఆలస్యం చేయకుండా ‘ఎన్టీఆర్’ అని చెప్పేశాడు. ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్, డెడికేషన్ చూసి తనకు గూస్‌బంప్స్ వచ్చాయని, అతను అద్భుతమైన కో-స్టార్ అని హృతిక్ షాకింగ్ కామెంట్స్ ఇచ్చాడు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కిక్కెక్కించే వార్తనే చెప్పాలి.
