Green Chilies: పచ్చిమిర్చి ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది అంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిదని మీరు నమ్ముతున్నారా? అవును, ఇది వంటకు రుచి, సువాసనను జోడించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్లు సి, ఎ, బి5 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, రోజుకు రెండు నుండి మూడు పచ్చి మిరపకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
పచ్చి మిరపకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పచ్చిమిర్చిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండిన మిరపకాయలకు బదులుగా తాజా మిరపకాయలను ఉపయోగించడం చాలా మంచిదని అంటున్నారు. ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.
పచ్చిమిరపకాయల్లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని తాజాగా ప్రకాశవంతంగా మారుస్తుంది.
Also Read: Health Tips: ఆలస్యంగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి పెద్ద ముప్పు.. ఎందుకో తెలుసా
పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అందువల్ల, రోజుకు రెండు నుండి మూడు పచ్చిమిరపకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
పచ్చి మిరపకాయల్లో బీటా-కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, క్రిప్టోక్సంతిన్ వంటి అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఆహారంలో భాగంగా పచ్చి మిరపకాయలు తినడం ఉత్తమమని అంటారు.
పచ్చిమిర్చి తినడం వల్ల వల్ల క్యాన్సర్ కూడా రాకుండా నిరోధించవచ్చని నిపుణులు అంటున్నారు. పచ్చి మిరపకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి పచ్చిమిర్చి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అని అంటారు. రోజుకు ఒకటి, రెండు కంటే ఎక్కువ పచ్చి మిరపకాయలు తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎక్కువగా తినొద్దు.