Jai Hanuman: రిషబ్ శెట్టి కాంతారతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు కాంతార 2తో పాటు తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో భారీ చిత్రం అనౌన్స్ చేశారు. అయితే, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ గురించి సమాచారం లేదు. గతంలో 2025 రిలీజ్ అని ప్రకటించినా, షూటింగ్‌లో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. రిషబ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ప్రశాంత్ వర్మ నిశ్శబ్దంగా ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారిక అప్‌డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.
